Kalki the human warrior (కలియుగ దైవం)

పాపాలు పెరిగిపోయినప్పుడు మనుషుల్లో స్వార్థం, దుర్మార్గం, పెరిగిపోయినపుడు , బలవంతులు బలహీనుల పైన ఆగయిత్యలు చేస్తూ వారి జీవితాలతో,ఆడుకుంటున్నప్పుడు దేవుడు ఈ ప్రపంచంలో ఉద్భవించి ఆ దుర్మార్గాలను నాశనం చేసి మంచి వారిని పుణ్యత్ములను సాధువులను కపడతడని ప్రజలు ముఖ్యంగా భారతీయ ప్రజలు బలంగా నమ్ముతారు వారి నమ్మకానికి తగినట్లు ప్రతీ యుగంలోనూ అలాగే జరుగుతూ వచ్చింది    ..... 
    


                            రాముడు, కృష్ణుడు, శివుడు మొదలైన వారు ప్రతీ యుగంలోనూ జన్మించి ఈ దేశంలోని ఉన్న అమాయక ప్రజలను కాపాడుతూ వచ్చారు ప్రజలు వారిని ఈ సర్వలోకలను సృష్టించిన దేవుని ప్రతీ రూపంగా భావిస్తారు వాళ్ళు సామాన్య ప్రజల ఊహలకు కూడా అందని ఎన్నో గొప్ప పనులు చేసి ఈ ప్రపంచాన్ని విడిచి మళ్ళీ ఆ పరమాత్మ వద్దకు వెళ్ళిపోయారు పరమాత్మ లో కలిసిపోయారు .


         
                    అందుకే ప్రజలు వారికి ఆలయాలు నిర్మించి, పూజలు పునస్కారాలు చేస్తూ మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఈ ప్రపంచాన్ని కాపాడమని, తమని, తమ కుటుంబాన్ని మాత్రమే కాకుండా ఈ ప్రపంచాన్ని కూడా చల్లగా చూడమని వేడుకుంటారు అందుకే పూజలు చేసినప్పుడు సర్వేజన సుఖినోభవంతు అని ఆశీర్వదిస్తారు.



                            అలాగే కలియుగంలో కూడా పాపాలు పేరిగి పోయినప్పుడు బలవంతులు బలహీనుల పైన దవృజన్యాలు చేస్తునప్పుడు , సామాన్య జనం జీవితల పైన అధికారం చెలయిస్తున్నప్పుడు ఆ పరమాత్మ కల్కి భగవాన్ రూపంలో జన్మిస్తాడని జనం బలంగా నమ్ముతారు ఆ భగవంతుడి రాకకై ఎదురు చూస్తున్నారు....





ఎలా వస్తాడు ఆ భగవంతుడు? ఎలా వస్తాడు ఆ కల్కి భగవానుడు? వచ్చి చెడ్డ వారిని ఎలా శిక్షిస్తాడు? బాంబులు, తుపాకులు ఉపయోగించే నేటి మనుషుల పైన బాణాలు వేసి గెలుస్తాడా? లేదా చేయిత్తి చూపించగానే అరచేతి నుంచి ఒక వెలుగు వచ్చి దుర్మార్గులను ఆ వెలుగు శిక్షిస్తుంద? మంచి వారిని రక్షిస్తుంద ? అదే నిజమైతే రాముడు, కృష్ణుడు శివుడు, రుద్రుడు ఇలా మన దేశాన్ని, మన భారతీయులను పూర్వం నుండి కాపాడుకుంటూ వస్తున్న దైవాలు పెద్ద పెద్ద యుద్దాలు ఎందుకు చేశారు? అత్యాధునిక దివ్యస్ట్రాలు ఎలా వాడారు, అంటే దేవుడు కూడా చెడ్డ వారిని చంపలంటే దివ్య శక్తులను ఉపయోగించకుండా ఎన్నో యుద్దాలు చేశారు. ఎన్నో దివ్యా అస్త్రాలు  ఉపయోగించారు . చివరికి ఆ రాక్షసులను సంహరించారు .




అంటే కల్కి భగవానుడు కూడా మామూలు మనిషిగా జన్మిస్తాడ ? అత్యాధునిక ఆయుధాలను ఉపయోగించి, యుద్దాలు చేసి ఆ దుర్మార్గులను సంహరించి మంచి వారిని కపడుతాడ? 




ఇలా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి , ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే వచ్చే భాగం కోసం వేచి ఉండండి.




            మీ రుద్ర 

Comments